Monday, May 20, 2024

SKLM: స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..

పోలింగ్ అధిక శాతం జరిగేలా అందరూ సహకరించాలి
జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సామూన్
శ్రీకాకుళం, మే 10: సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సామూన్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ శుక్రవారం ఉదయం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వేప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యావరణ సహిత ఓటర్ల అవగాహనా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సామూన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో మొక్కలు నాటి, పలువురికి మొక్కలు అందజేసిన అనంతరం మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని, 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. 2019 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత బాగా పెరగాలని ఆకాంక్షించారు. మహిళలు, వికలాంగులు, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మారుమూల గ్రామాల్లో, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని, ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని, ఇందుకోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే లక్ష్యంతో పలు స్వేప్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ శ్రీకాకుళం బ్రాంచ్ దంత వైద్యులు శిల్లా సతీష్ కుమార్ ప్రెసిడెంట్, వంశీకృష్ణ సెక్రెటరీ, ఊడి సంతోష్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ర్యాలీని జిల్లా కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మునిసిపల్ కార్యాలయం వరకు జరిగింది.

- Advertisement -


సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎల్.డి ఎం, సూర్య కిరణ్, మెప్మా పీడీ కిరణ్, ఎన్వైకే కోఆర్డినేటర్ ఉజ్వల్, బీసీ కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ, సాంఘీక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విశ్వ మోహన్ రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్ అధికారి వాసుదేవరావు, స్వీప్ స్వచ్ఛంద సంస్థ కొమ్ము రమణ మూర్తి, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కె.సూర్య చంద్ర రావు, చిన్నా రావు, ఎ మోహనరాజు, ఐ.హేమ పద్మజా, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement