Monday, May 20, 2024

NZB: పట్టణంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు

నిజామాబాద్ ప్రతినిధి, మే 10 (ప్రభ న్యూస్) : నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవ చ్చని పట్టణ సర్కిల్ ఇనస్పెక్టర్ నరహరి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో అడిషనల్ సీఐ కోటేశ్వరరావు, శంకర్, ఏసీపీ నిజామాబాద్ రాజా వెంకట రెడ్డిల పర్యవేక్షణలో శుక్రవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో టౌన్ సిఐ నరహరి, రెండో పట్టణ ఎస్సై రామ్ లు రానున్న లోక్ స‌భ‌ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను దృష్టిలో పెట్టుకుని రెండవ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ పరిధిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు.

స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నికల కోసం మీతో ఉన్నామని ప్రజల్లో నమ్మకం కలిగించడం, ప్రజలు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తాము మీకోసం ఉన్నామని ప్రజల్లో నమ్మ కం కలిగించడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశమని పట్టణ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నరహరి అన్నారు. ఈ కవాతులో సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ లు కుతుబుద్దీన్, యాదవ్, రెండో పట్టణ ఎస్సై రామ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement