Wednesday, May 1, 2024

10 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసిన భారత్.. 2-0తో ఆధిక్యంలో విమెన్స్ జ‌ట్టు

శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ల‌లో భార‌త్ 2-0 ఆధిక్యంలో ఉంది. పల్లెకెలెలో సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు గెలిచింది. బ్యాటింగ్, బాలింగ్ విభాగాల్లో లంక‌పై ఆధిపత్యం చూపింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాదించింది భార‌త్. మొద‌ట‌ టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుని బ‌రిలోకి దిగింది. అయితే.. భార‌త‌ బౌలర్లు లంకను 173 పరుగులకే ఆలౌట్ చేశారు. సీజన్డ్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్ లంకేయులను ఆలౌట్ చేసింది.

ఆ తర్వాత.. స్మృతి మంధాన 83 బంతుల్లో 94 పరుగులు చేసి, షఫాలీ వర్మ (రన్-ఎ-బాల్ ) 71 పరుగులతో అద్భుతమైన విజయానికి బాటలు వేశారు. మొదటి ODIను సునాయాసంగా గెలిచిన తర్వాత.. భారతీయులు రెండో గేమ్‌లో శ్రీలంక జట్టు మ‌రో షాక్ ఇచ్చారు. అంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో విజయం సాధించడం భార‌త్ కు విశ్వాసాన్ని ఇచ్చింద‌నే చెప్పాలి. ఇక తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. గురువారం జ‌ర‌గ‌నున్న‌ ఆఖరి మ్యాచ్‌లో 3-0తో సిరీస్ ని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement