Monday, December 9, 2024

సినీ నటి పూర్ణకు మగబిడ్డ.. పేరు డిసైడ్​ చేస్తూ పోస్టు షేర్​ చేసిన దంపతులు

టాలీవుడ్ లో ప్రేక్ష‌కుల‌కు పూర్ణగా ప‌రిచ‌యం ఉన్న‌ నటి షమ్నా కాసిమ్.. పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె తన నటనా వృత్తిని కొనసాగిస్తూనే వ‌స్తోంది. కాగా, ఈ నెల (ఏప్రిల్) 2023 మొదటి వారంలో మగబిడ్డకు జ‌న్మ‌నిచ్చింది పూర్ణ‌. తాజా వార్త ఏమిటంటే, పూర్ణ‌ తన బిడ్డ పేరును ప్రకటించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను కూడా షేర్ చేసింది.

ఈ ఫొటోతో పూర్ణ, ఆమె భర్త షానిద్ అసిఫాలీ త‌మ‌ నవజాత శిశువుకు “హమ్దాన్ అసిఫాలీ” అని పేరు పెట్టిన‌ట్టు తెలిపారు. ఫొటో చూసిన‌ నెటిజన్లు అభినందన‌లు తెలుపుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. OTT ప్లాట్‌ఫామ్ ETV విన్‌లో నేరుగా విడుదలైన ఈ సినీనటి తాజా చిత్రం ‘అసలు’ ప్రేక్షకుల నుండి మిశ్రమ రెస్పాన్స్​ని అందుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement