Saturday, July 27, 2024

శారీలో నిహారిక ఫొటో షూట్..

శారీలో ఫొటో షూట్ చేసింది న‌టి..నిర్మాత నిహారిక‌.దాంతో ఆమె హోమ్లీ లుక్ కి నెటిజెన్స్ నుండి పాజిటివ్ కామెంట్స్ దక్కుతున్నాయి. అయితే సదరు ఫోటోలకు నిహారిక ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తుంది. సాయంకాలం ఫీలింగ్ అని కామెంట్ పెట్టారు. దీనికి మరో అర్థం కూడా చెప్పొచ్చు. ముగిసిపోతున్న భావన… అని కొందరి అభిప్రాయం. నిహారిక విడాకుల వార్తల నేపథ్యంలో ఈ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గత నెల రోజులుగా విడాకుల ప్రచారం జరుగుతున్నా నిహారిక పెదవి విప్పింది లేదు. స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సాధారణంగా న‌టుడు నాగబాబు తన కుటుంబం మీద వచ్చే ఆరోపణలకు, పుకార్లకు రియాక్ట్ అవుతారు. కూతురు నిహారిక విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా ఆయన నోరు మెదపకపోవడం కోసం మెరుపు…అలాగే నిహారిక కెరీర్ మీద దృష్టి పెట్టారు. నిర్మాతగా రాణించాలని భావిస్తున్నారు. నిహారికకు పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ ఉంది. ఈ నిర్మాణ సంస్థలో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మించారు.ఈ బ్యానర్లో భవిష్యత్తులో కొత్త ప్రాజెక్ట్స్ తెరకెక్కించేందుకు నిహారిక సీరియస్ గా ముందుకు వెళుతున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్ తో చర్చలు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement