Tuesday, April 30, 2024

Fatehi: చీర‌క‌ట్టులో ‘ఔరా’… 

డ్యాన్సర్‌, మోడల్‌, నటి, రియలిటీ షోకు జడ్జిగా అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి.ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయినా అవలీలగా చేసి చూపుతిప్పుకోనివ్వని బ్యూటీ..” దిల్ బర్, సాకీ సాకీ ” లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకుంది.

టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి సినిమాలతో పాటూ బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరక్కెకిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ లో నోరా ఫతేహి నటిస్తోంది. ఇప్పటివరకూ స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన నోరా.. టాలీవుడ్ లో హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకుంటోన్నది మాత్రం పవన్ మూవీతోనే. దీంతో గ్లామ‌ర్ షోని ప‌క్క‌న పెట్టి సంప్ర‌దాయ దుస్తుల‌లో మెరుపులు చూపిస్తున్న‌ది.. చీర‌క‌ట్టులో ఆమెను ఔరా అంటున్నారు అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement