Tuesday, May 7, 2024

ఎఫ్3 – ఈ నెల 7న ఫ‌స్ట్ సింగిల్

న‌వ్వులు పూయించేందుకు సిద్ధ‌మ‌ని ఎఫ్3 చిత్ర యూనిట్ వెల్ల‌డించారు. కాగా ఈ చిత్రం నుండి ఈ నెల‌7వ తారీఖున ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేయ‌నున్నామ‌ని అధికారికంగా చెప్పారు. ఈ మేర‌కు పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరోలు వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ’ అంటూ ఈ పాట సాగనుంది.

పూర్తి వినోదభరితమైన ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’ సినిమాలో తమని పట్టించుకోవడం లేదంటూ భార్యల పోరును చూపించారు. ‘ఎఫ్ 3’లో డబ్బు సంపాదించడం లేదంటూ భర్తలను వేధిస్తుండటం ప్రధానంగా చూపించనున్నారు. ఆ నేపథ్యంలో వచ్చే పాటే ఇదట‌. ఈ సినిమాలో వెంకటేశ్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జోడీలు అలాగే కనిపించనున్నాయి. కొత్తగా ఈ సినిమాలో జాయినైన ఆర్టిస్టుల జాబితాలో సునీల్ .. అంజలి .. సంగీత వున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement