Wednesday, May 8, 2024

టక్ జగదీష్ పై ఎగ్జిబిటర్లు ఆగ్రహం

శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగదీష్ నాయుడు పాత్రలో నాని కనిపించబోతున్నారు. ఇక ఇందులో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే టక్ జగదీశ్ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయడంపై ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు.

సెప్టెంబర్10న థియేటర్లలో లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అవుతున్న రోజునే టక్ జగదీశ్ ను ఓటీటీ లో ఎలా రిలీజ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజున ఓటీటీ లో కొత్త సినిమాను రిలీజ్ చేయకూడదన్నారు. హీరో నాని తన నిర్మాతలతో దీనిపై మాట్లాడాలని.. రిలీజ్ డేట్ ను మార్చుకోవాలని, లేదంటే నాని సినిమాలను థియేటర్లలో ప్రదర్శించకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement