Tuesday, April 30, 2024

రాఖీభాయ్‌ గ్యాంగ్ స్ట‌ర్ కాదు, మాన్‌స్ట‌ర్‌.. కేజీఎఫ్‌ నుండి మ‌రో సాంగ్ రిలీజ్‌

కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. మూడేళ్ల క్రితం వరకు ఈయన కేవలం కన్నడలోనే స్టార్ హీరో. కానీ, ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో అయ్యాడు. రాఖీ భాయ్ గురించి తెలియని ప్రేక్షకుడు ఇప్పుడు లేరంటే అతిశయోక్తి కాదేమో? కెజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఈయన రేంజ్ కంప్లీట్​గా మారిపోయింది. పాన్ ఇండియన్ రేంజ్‌లో తన మార్కెట్ పెంచుకున్నాడు యశ్. తెలుగులో కూడా మంచి మార్కెట్ వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన కెజిఎఫ్.. అంతకంటే భారీగానే బాక్సీఫీస్​ దగ్గర వసూళ్లు చేసింది.. అన్ని ఇండస్ట్రీలో విజయబావుటా ఎగరవేసింది.

అయితే.. కొద్ది సేప‌టి క్రితం ఈ సినిమాకి సంబందించిన మాన్​స్టర్​ అనే మరో సాంగ్​ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఇదివ‌ర‌కే ఈ సినిమా నుంచి తుఫాన్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. ఈ పాటలో యశ్ .. హీరోయిజం ఎలివేషన్ ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. రవి బస్రూర్​ సంగీతం అందించిన‌ ఈ పాటను చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement