Tuesday, April 30, 2024

క‌ట‌క‌టాల పాలైన ముద్దుల ప్రియుడు.. న్యూసెన్స్ కేసు పెట్టిన పోలీసులు

వాళ్లు మాంచి జోష్‌లో ఉన్నారు. ఏకాంతంగా బైక్‌పై వెళ్తున్నారు. వారి వ‌య‌సుకు హ‌ద్దు లేకుండాపోయింది. బైక్‌పైనే చిలిపి చేష్ట‌లు చేస్తూ మేఘాల‌లో తేలిపోతూ అలా అలా దూసుకెళ్లారు. ఇట్లా బైక్‌పై దూసుకెళ్తూనే ముద్దుల‌తో చెల‌రేగిపోయిందో జంట‌. కాగా ఈ వీర ప్రేమికుల చిత్రాలు కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పోలీసులు వారి కోసం సెర్చ్ చేయ‌డం ప్రారంభించారు.

హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించిన యువ‌కుడి బైక్ నెంబ‌ర్ ఆధారంగా ప‌ట్టుకున్నారు. ఇప్పుడు ఆ యువకుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు. ఆ వీర ప్రేమికున్ని క‌ర్నాట‌క‌లోని చాజరాజనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుండ్లుపేట–చాజరాజనగర మార్గంలో బైకు నెంబర్‌ ఆధారంగా బైకిస్టు స్వామిని అరెస్ట్‌ చేశారు. ప్రియురాలితో ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై దూసుకెళ్లిన దృశ్యాలు వైరల్‌ కావడం తెలిసిందే. దీంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్‌ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement