Thursday, May 2, 2024

ఎడిటింగ్ వ‌ర్క్ స్టార్ట్ చేసిన.. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ టీం

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. వాటిల్లో ఒక‌టి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. కాగా ద‌ర్శ‌కుడు హరీష్‌ శంకర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్‌ సింగ్. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ఎడిటింగ్‌ వర్క్‌ మొదలైంది. డైరెక్టర్‌, నిర్మాతలు, టెక్నీషియన్ల బృందం పూజా కార్యక్రమంతో ఎడిటింగ్‌ వర్క్స్‌ మొదలుపెట్టారు. పూజా కార్యక్రమం ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ, ఇతర వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి నేతృత్వంలో భారీ సెట్‌ వేసిన విషయం తెలిసిందే‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement