Wednesday, May 1, 2024

పార్ట్ 2కి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం పుష్ప రెండో భాగానికి బన్నీ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట.

అందుకు ఒప్పందం కూడా కూర్చున్నట్లు తెలుస్తుంది. కానీ మొదటి భాగానికి మాత్రం 50 కోట్లు తీసుకోలేదట. మొదటి భాగానికి లాభాల్లో వాటాలు ఉండటం వల్ల అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోలేదట. కానీ రెండో భాగానికి మాత్రం వాటాలు తీసుకోకుండా… ఓన్లీ రెమ్యునరేషన్ మాత్రమే తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement