Friday, May 17, 2024

బీహార్‌లో మ‌రో 10 రోజ‌లు లాక్‌డౌన్..

బీహార్‌లో మ‌రో 10 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్ప‌టికే మే 15 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఇప్పుడు ఆ లాక్‌డౌన్‌ను మే 16 నుంచి 25వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ‌కుమార్ కూడా ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హమ్మారి ప‌రిస్థితిపై క్యాబినెట్‌లో స‌మీక్ష నిర్వ‌హించామ‌ని, లాక్‌డౌన్ స‌త్ఫ‌లితాలు ఇచ్చింద‌ని ఈ స‌మావేశంలో తీర్మానించామ‌ని, అందుకే లాక్‌డౌన్‌ను మ‌రో 10 రోజులు పొడిగించాల‌ని నిర్ణ‌యించామ‌ని నితీశ్ కుమార్‌ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement