Saturday, May 4, 2024

అమెరికా-రష్యా నుంచి వ్యాక్సిన్ల కొనుగోలు..గ్లోబల్ టెండర్లకు రాజ‌స్థాన్ నిర్ణ‌యం

 అమెరికా-రష్యా నుంచి రాజస్థాన్ ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ క్యాబినెట్‌ అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రెండు రోజుల క్రితం ఆరోగ్య శాఖ, కోర్ గ్రూప్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు ఈ ప్రక్రియ‌ను చేప‌ట్టారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన‌ ఫైజర్, రష్యా త‌యారీ స్పుత్నిక్ వ్యాక్సిన్ల‌ను కొనుగోలు చేయ‌డానికి రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు సంప్రదిస్తున్నారు.

నాలుగైదు రోజుల్లో గ్లోబ‌ల్ టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తిచేసేందుకు అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.18 ఏండ్ల వ‌య‌సు పైబ‌డిన వారికి టీకాలు వేయడానికి తగినంత టీకాలు అందుబాటులో లేక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు విదేశాల నుంచి గ్లోబ‌ల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలు చేయాల‌ని నిర్ణ‌యించాయి. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గం వర్చువల్ సమావేశంలో కరోనా వ్యాక్సిన్ దిగుమతి కోసం గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు ఆమోదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement