Friday, April 26, 2024

దట్ ఈజ్ మెగాస్టార్….ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్ చరణ్ ,చిరు లుక్ లతో పాటు మోషన్ పోస్టర్, ఆడియో సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు.

ఇక చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద మొత్తంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 125 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

ఇంత పెద్ద మొత్తంలో లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం పట్ల మరోసారి మెగా స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ అయిందంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత వేదాళం, లూసిఫర్ రీమేక్ లలో మెగాస్టార్ నటించబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement