Monday, April 29, 2024

అల్లుఅర్జున్ టు ప్రభాస్ వయా ‘ఐకాన్’

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమా తెరక్కెబోతున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రకటించిన తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అలవైకుంఠ పురములో సినిమాను చేశాడు. ఆ సినిమా తర్వాత ఐకాన్ మూవీ పట్టాలెక్కుతోందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్లేస్ లో పుష్ప వచ్చింది.

మరోవైపు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా హిట్ కావడంతో ఐకాన్ సినిమా పై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాడట వేణు శ్రీరామ్. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు ఈ కథను వినిపించాలని సన్నాహాలు చేస్తున్నాడట. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా ప్రభాస్ తో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ ఐకాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement