Monday, April 29, 2024

దిల్ రాజు కాళ్లు పట్టుకున్న పవన్ అభిమాని – ఫొటోస్ వైరల్

మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ను పెద్ద స్క్రీన్ పై చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈలలు గోలలతో థియేటర్స్ దద్దరిల్లి పోతున్నాయి. అయితే అభిమానులతో పాటు సాధారణ వ్యక్తిలా దిల్ రాజు కూడా వకీల్ సాబ్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ని చూసి పేపర్స్ కూడా ఎగురవేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఆ సమయంలో దిల్ రాజు కు ఓ షాక్ తగిలింది. ఓ వ్యక్తి అమాంతంగా వచ్చి దిల్ రాజు కాళ్లపై పడి పోయాడు. ఎవరు చెప్పినా వదల్లేదు. మా కల నిజం చేశావంటూ కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఇక చుట్టుపక్కల ఉన్న వారు అతనిని పైకి లేపడం తో దిల్ రాజు మాట్లాడి ఆ వ్యక్తి ని కూల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement