Sunday, April 28, 2024

సర్జరీ సక్సెస్..గర్జించే సింహంలా వస్తా: శ్రేయాస్

 భుజం గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్‌కు దూరమయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ భుజానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌లో ఓ ఫోటో ద్వరా పంచుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. సర్జరీ సక్సెస్ అయ్యింది. గర్జించే సింహంలా నేను మళ్లీ జట్టులోకి తిరిగొస్తా… మీ అందరి అభిమానానికి థాక్స్ అంటూ ట్వీట్ చేశాడు శ్రేయాస్. అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయ్యర్ ఇటీవల ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకషైర్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. గాయం కారణంగా కౌంటీల్లో ఆడేది అనుమానమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement