Friday, April 26, 2024

గర్భం పెళ్లికి ముందా, తర్వాత నా ఇష్టం..

ఇటీవల విడుదలైన నాగార్జున వైల్డ్‌డాగ్‌ మూవీతో తెలుగు తెరపై సందడి చేసింది దియామిర్జా. సోషల్ మీడియాలో అభిమానులతో పలు ఆశక్తికర విషయాలు చర్చించింది. దియామిర్జా తాను గర్భవతి అన్ని విషయం ఈ మధ్యే ప్రకటించింన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న దియామిర్జా. ఈ విషయం తెలియజేయగానే, పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చారా అన్న సందేహాలు తలెత్తాయి అభిమానులకు. ఇదే విషయాన్ని ఇన్‌స్టా వేదికగా ఆమె వద్ద ప్రస్తావించారు నెటిజన్లు. 

ఇందుకు బదులిచ్చిన దియా.. మంచి ప్రశ్న అడిగారు. మా ఇద్దరికి బిడ్డ పుట్టబోతోంది కాబట్టి మేం పెళ్లి చేసుకోలేదు. వివాహ బంధంతో ముడిపడాలని ఎప్పటినుంచో ప్రణాళికలు రచించుకుంటూనే ఉన్నాం. అలాంటి సమయంలోనే మా జీవితంలోకి చిన్నారి రాబోతుందనే విషయం తెలిసింది. గర్భవతిని కాబట్టి హడావుడిగా పెళ్లిచేసుకోలేదు. ఇక ఈ విషయం వివాహానికి ముందే ప్రకటించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఇక బిడ్డను కనడం జీవితానికి గొప్ప బహుమతి అ‍న్న దియా.. అది, పెళ్లికి ముందా, పెళ్లి తర్వాత అన్న విషయం పూర్తిగా వ్యక్తిగతం అని, సదరు మహిళ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని, ఇందుకు సమాజం ఏమనుకుంటుందోనన్న భయాలు అక్కర్లేదని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement