Sunday, April 11, 2021

30వ వార్డులో నోటిఫికేషన్‌..

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 33వ వార్డు స్థానం ఖాళీగా ఉన్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు మున్సిపల్‌ కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌ తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ ప్రకారం ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాను బెల్లంపల్లి మున్సిపాలిటీ, తహశిల్దార్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో అతికించారు. ఈ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 6వ తేది నుండి 9వ తేది వరకు మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని, ఈ అభ్యంతరాలను మున్సిపల్‌ కార్యాలయంలో ఈ నెల 10 శనివారం రోజున నివృత్తి చేయబడుతుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News