Sunday, April 11, 2021

ఆదిత్య మ్యూజిక్ బ్లాక్ బస్టర్స్ లిస్టులో సారంగదరియా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం లవ్ స్టోరీ. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో సారంగదరియా సాంగ్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన 32 రోజులలోనే 100 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆదిత్య మ్యూజిక్ వారు ఆదిత్య మ్యూజిక్ బ్లాక్ బస్టర్స్ లిస్టులో ఈ సాంగ్ ని చేర్చారు.

గతంలో చూసుకుంటే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ని బుట్ట బొమ్మ పాట 575 మిలియన్ల వ్యూస్ ని సంపాదించింది. అలాగే రాములో రాముల సాంగ్ 353 మిలియన్లు, సామజవరగమన 227 వ్యూస్ రాబెట్టాయి. ఇక ఫిదా చిత్రంలోని వచ్చిందే సాంగ్ కు 295 మిలియన్ వ్యూస్, ఉప్పెన సినిమా లోని నీ కళ్ళు నీలి సముద్రం 204 మిలియన్లు వ్యూస్ ను దక్కించుకున్నాయి.

వాటితో పాటు ఇంకొన్ని సాంగ్స్ కూడా 100 మిలియన్ల లకు పైగా వ్యూస్ ను సంపాదించుకున్నాయి. అందులో తాజాగా ఈ సాంగ్ కూడా చేరింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News