Saturday, April 27, 2024

ధ్రువ నక్షత్రం అప్ డేట్.. హీరోగా విక్రమ్

గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ చిత్రంలో హీరోగా విక్రమ్ నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టును ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లాంఛ్ చేసిన ధ్రువ నక్షత్రం పోస్టర్లుఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. తాజాగా మరో అప్‌డేట్ బయటకు వచ్చింది. మేకర్స్ ధ్రువ నక్షత్రం కొత్త టీజర్‌ త్వరలోనే రానుంది. ఈ చిత్రాన్ని జులైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో రీతూవర్మ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా .. ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement