Tuesday, March 26, 2024

సద్గురువు కటాక్షం!

గురువు దైవం ఒకటేనని స్మృతులు, శ్రుతులు చెబుతున్నాయి. దేవుడికి ఇచ్చిన నిర్వచనమే గుణా తీతుడని, రూపాతీతుడని, ఉపాధిరహతుడని గురు వును భావించవచ్చు.
గురువుల్లో నియత గురువులు, అనియత గురు వులు ఉంటారు. నియత గురువులు నియమించిన వారు. అనియత గురువులు సమయానుకూలంగా వచ్చి అంతరంగాన మంచిగుణములను పెంచి మోక్షమార్గం చూపుతారు. నియత గురువులు నీవు.. నేను అనే ద్వంద్వ భావం పోగొట్టి అంతరంగమున యోగాన్ని ప్రతిష్టించి తత్వమసి అయ్యేలా చూస్తా రు. మనల్ని ఎవరైతే సహజ స్థితిలో నిలుచునట్లు చేసి ఉనికికి అతీతంగా తీసుకుపోయేవారే సద్గు రువులు. సద్గురువు లభించడం నిజంగా అదృష్టమే. ఉత్తమ గురువు ఉత్తమ శిష్యుడి కోసం ఎదురు చూస్తాడు. లభిస్తే తనకు తెలి సిన విద్య మొత్తం అనుగ్రహస్తాడు. ద్రోణాచార్యుడు తన ప్రియశిష్యుడు అర్జునుడికి సమస్త అస్త్ర శస్త్ర విద్యల తోపాటు బ్రహ్మశిరోనామాస్త్రమనే అత్యంత శక్తి గల దాన్ని ప్రసాదించాడు. అలాగే దాని ఉపసం#హరణ కూడా చెప్పాడు. తన కుమారుడు అశ్వద్ధామకు కేవలం ఆ అస్త్రం ప్రయోగం బోధించాడు. అశ్వద్ధా మ యుద్ధం ముగిసిన అనంతరం పాండవుల నాశ నానికి ఆ అస్త్రం ప్రయోగించాడు. అది సర్వ వినాశ నం చేస్తుంటే అర్జునుడు ఉపసం#హరించాడు. ఆదర్శ శిష్యుడు ఎప్పుడూ లోకకల్యాణం కోరుకుం టాడని అర్జునుడు నిరూపించాడు. అలాగే మంచిగురువు కోసం వెతుకుతూ వివేకానందుడు రామకృష్ణ పరమ #హంస వద్దకు వచ్చాడు. ఆయన శిష్యరికంలోనే లోక ప్రసిద్ధుడయ్యాడు. గురువు శిష్యునికి తాబేలు పిల్లలను పెంచినట్లు జ్ఞాన భిక్ష పెడతారు. తాబేలు తన పిల్లలకు పాలు ఇవ్వదు. ఆహారం పెట్టదు. కేవ లం చూపుతోనే వాటిని పోషి స్తుంది. ఆలాగే గురువు చూపుతోనే శిష్యునికి సమస్త విద్యలను ప్రసాదిస్తాడు. అందుకు శిష్యుడు గురు శుశ్రూష చేసి ఆయన అను గ్రహం సంపాదించాలి.
గురువు విత్తనం వంటివాడు. శిష్యుడు క్షేత్రం. ఆ క్షేత్రం సారవంతమైతే చెట్టు సుసంపన్నమౌతుం ది. గురువులను చెప్పుకునే కొందరు సమయం అం తా తమ సోత్కర్షతోనే గడిపేస్తారు. వారు ఆత్మజ్ఞా నం పొందినవారు కాదు. అటువంటివారు శిష్యుల కు ఎలా దారి చూపిస్తారు. సద్గురువు సమాగమనం పొందడం పూర్వజన్మ సుకృతం.
అజ్ఞానాన్ని పోగొట్టి వెలుగులోకి నడిపించేవా డు నిజమైన గురువు. శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, రమణ మ#హర్షి, సాయిబాబా వంటి వారు ఆత్మజ్ఞానం పొంది శిష్యులకు దాన్ని ప్రసాదిం చారు. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి బ్రహ్మంతో నిరంతరం ర మిస్తాడు. ఆయనే సద్గు రువు.
జ్ఞానాన్ని అం దుకోవాలంటే కామ క్రోధ లోభమదమా త్సర్యాలు అడ్డ ుపడతా యి. వాటిని జయిస్తేనే గు రుకటాక్షం లభిస్తుంది. వాటిని అదుపు చేయాలంటే ఏకైక మార్గం గురు స్మ రణ. విషయములను అనుభ వించే ముందు గురువు మన చెంత ఉన్నాడనే స్మృ#హ ఉండా లి. అప్పుడు వాటిని అనుభవించవచ్చునా అనే ప్రశ్న తలెత్తును. ఏది అనుభవించడానికి తగదో దాన్ని విడిచిపెట్టా లి. ఈ అభ్యాసంతో నెమ్మదిగా వృత్తులన్నీ నిష్కమించును. ఫలి తంగా దుర్గుణాలు పోయి శీలం చక్కపడును శుద్ధత్వం తలెత్తి గురు కృపకు పాత్రుడౌతాడు.
జీవాత్మ పరమాత్మ స్వరూపమని, ఆత్మ అనే జ్యోతిని ప్రజ్వలనం చేసేవాడు గురువు. జ్యోతి ప్రజ్వలనం అయితే గురు కృ ప లభించినట్లే. గురుశుశ్రూష చేస్తే లభించనిది లేదు. గురువు మౌనంగా ఉన్నా శిష్యుడిని అనుగ్ర హంచగలడు. రమణమ#హర్షి మౌనం పాటించేవా రు. కావ్యగణపతి స్వామితో మౌనంలోనే సంభాషిం చేవారు. గురువు దర్శనం చెయ్యడం కూడా ఆయన కృప ఉంటేనే సాధ్యం. సాయిబాబా చరిత్రలో ఆయ న సజీవంగా ఉన్నప్పుడు చూడాలనుకున్న ఎంతో మందికి దర్శనం లభించలేదు. ఆయన కృప కొద్ది మందికి మాత్రమే లభించింది.
జీవుడిని పంజరంలోని చిలకతో పోల్చవచ్చు ను. జీవుడు శరీరంలో, రామచిలక పంజరంలోనూ ఉంటారు. ఇద్దరూ తమ ప్రస్తుత స్థితే బాగుందని భావిస్తారు. గురువు లాంటి సహాయకుడు వచ్చి వాటిని బంధవిముక్తులను చేస్తేనే నిజమైన స్థితి అర్ధమవుతుంది. గురువు రూపంలో భగవంతుడు కనిపించి గతించిన జీవితం కంటే రానున్నది గొప్ప దని గ్రహంపచేస్తాడు. అజ్ఞానంలో ఉన్న వ్యక్తిని శరీర మనే పంజరం నుంచి తప్పించి జ్ఞానమనే ఆత్మను ఆవిష్కరింప చేసే గురువు పూజ్యనీయుడు. గురువు- దైవం వేరుకాదనేది అసలైన సత్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement