Sunday, May 5, 2024

Dhootha Trailer | నాగచైతన్య ‘దూత’.. ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్

ఇప్పటి వరకు వెండితెరపై సినిమాలతో అలరించిన హీరో నాగ‌చైత‌న్య ఫస్ట్ టైమ్ ఓ వెబ్ సిరీస్ చేశారు. డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాచురల్ థ్రిల్లర్ జానర్‌లో నాగ చైతన్య హీరోగా నటించిన ఓటీటీ ప్రాజెక్ట్ ‘దూత. కాగా, ఇవ్వాల నాగ‌చైత‌న్య పుట్టినరోజు సంద‌ర్భంగా ఈ వెబ్‌సిరీస్ ట్రైటర్‌‌ని రిలీజ్ చేశారు.

‘దూత’లో జర్నలిస్టు సాగర్ పాత్రలో నాగ చైతన్య నటించారు. ఆయన సమాచార్ దిన పత్రికలో చేస్తున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఓ రోడ్డు ప్రమాదం, తర్వాత వరుస హత్యలకు, జర్నలిస్ట్ సాగర్ మధ్య సంబంధం ఏమిటి? హత్య జరిగిన ప్రతి చోట న్యూస్ పేపర్ కటింగ్స్ ఎందుకు ఉన్నాయి? కథలో కార్టూన్ ఇంపార్టెన్స్ ఏంటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1 నుంచి ‘దూత’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ వెబ్‌సిరీస్‌ని మొత్తం మూడు సీజన్స్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్.. ఒక్కో సీజన్ లో 8 లేదా 10 ఎపిసోడ్స్ ఉండనున్నాయి.

- Advertisement -

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement