Saturday, April 27, 2024

అరణ్య మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు దగ్గుబాటి రానా. దగ్గుబాటి రానా ప్రస్తుతం ప్రభు సొలొమాన్ దర్శకత్వంలో తెరకెక్కిన అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే….సీడెడ్- 0.18 కోట్లు, ఉత్తరాంధ్ర- 0.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 0.09 కోట్లు, వెస్ట్ గోదావరి లో- 0.10 కోట్లు, గుంటూరులో 0.23 కోట్లు, కృష్ణాలో 0.09 కోట్లు, నెల్లూరులో 0.06 కోట్లు సాధించింది. ఏపీ, తెలంగాణ మొత్తం 1.38 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.61 కోట్లు ఓవర్సీస్- 0.10 కోట్లు
వరల్డ్ వైడ్ మొత్తం 2.09 కోట్లును సాదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement