Tuesday, May 7, 2024

క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ అంటే పిచ్చి ప్రేమ‌.. ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీ

హీరోయిన్ ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మీ పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రంలో మెరిసిన సంగ‌తి తెలిసిందే. ఐశ్వర్య లక్ష్మి వయసు 32 ఏళ్ళు. ఈ హాట్ బ్యూటీ డాక్టర్ వృత్తి నుంచి సినిమాల్లోకి వచ్చింది. ఆమె శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎర్నాకులంలో ఎంబిబిఎస్ పూర్తి చేసింది. కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య లక్ష్మీ, యువ నటుడు అర్జున్ దాస్ మధ్య సంథింగ్ సంథింగ్ సాగుతోంది అంటూ రూమర్స్ వినిపించాయి. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోస్ కూడా షేర్ చేశారు. అయితే తామిద్దరం స్నేహితులం మాత్రమే అని ఆ తర్వాత ఐశ్వర్య లక్ష్మీ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఇంటర్వ్యూలో తన లవ్ ఎఫైర్స్ పై ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను టీనేజ్ లో ఉన్నప్పుడు క్రికెటర్ యువరాజ్ సింగ్ తో ప్రేమలో పడ్డానని షాకింగ్ కామెంట్స్ చేసింది. మనసులోనే ఆయన్ని ప్రేమించేదాన్ని. యువరాజ్ సింగ్ అంటే పిచ్చి ప్రేమ నాకు. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల ఇప్పుడు కనీసం క్రికెట్ చూసే ఛాన్స్ కూడా రావడం లేదు. ఒక్క విలన్ రోల్స్ తప్ప ఎలాంటి పాత్రల్లో నటించేందుకు అయినా నేను రెడీ. నెగిటివ్ రోల్స్ నాకు నచ్చవు. అందుకే ఎప్పటికీ విలన్ గా నటించను అని ఐశ్వర్య లక్ష్మీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement