Thursday, May 16, 2024

కరోనా ను జయించిన అనిల్ రావిపూడి

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ కు ఈ మహమ్మారి సోకింది. కాగా ఇటీవల ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఏప్రిల్ 13న అనిల్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో స్వయంగా ఆయనే ప్రకటించారు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి కి నెగిటివ్ వచ్చింది. ఈ మేరకు ప్రెస్ నోట్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement