Wednesday, May 8, 2024

రాకేశ్ మాస్టర్ పై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు

డాన్స్ మాస్టర్ రాకేష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఇటీవలకాలంలో యూట్యూబ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఆయనను ఫేమస్ చేశాయి. కాగా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలు ఉన్నాయని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాకేష్ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… శ్రీకృష్ణుడి పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు రాకేష్ మాస్టర్. దీంతో యాదవ హక్కుల పోరాట సమితి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 295a, 298 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక రాకేశ్ మాస్టర్ కూడా పలువురిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కృష్ణా నగర్ లోని తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దుర్భాషలాడి బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు రాకేశ్ మాస్టర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement