Friday, May 3, 2024

చెర్రీ శంకర్ సినిమాకు లైన్ క్లియర్ !!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు రామ్ చరణ్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇదిలాఉండగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్2 సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇదే విషయమై నిర్మాతలు శంకర్ పై కోర్టులో కేసు వేశారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమా చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు.

దీంతో చరణ్ అభిమానులు శంకర్ తో సినిమాపై నిరాశ చెందారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇండియన్2 సినిమా పూర్తయ్యే వరకు వేరొక సినిమా చేయకూడదనే పిటిషన్ ను తమిళనాడు హైకోర్టు కొట్టివేసినట్లు తెలుస్తోంది. ఇక దీంతో శంకర్ చరణ్ సినిమాలకు అడ్డు తొలగినట్టేనని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement