Wednesday, May 15, 2024

SR కళ్యాణమండపం రిలీజ్ పై క్లారిటీ

కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న చిత్రం SR కళ్యాణమండపం. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రమోద్ రాజులు నిర్మిస్తున్న ఈ సినిమాలో టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కిరణ్ సరసన నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చూసాలే కళ్ళారా, చుక్కల చున్నీకే సాంగ్స్ హైలెట్ గా నిలిచాయి.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే SR కళ్యాణమండపం సినిమా కూడా రిలీజ్ చేయనున్నారని… గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. SR కళ్యాణమండపం చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలో రిలీజ్ చేస్తామని పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కిరణ్ అబ్బవరం అందిస్తుండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement