Sunday, April 28, 2024

చూసానే కళ్లారా ‘ఎస్. ఆర్ కళ్యాణ్ మండపం’…50 మిలియన్ల వ్యూస్

రాజావారు రాణి గారు సినిమా తో హీరోగా పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ప్రియాంక జవాల్కర్ హీరో హీరోయిన్ గా ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రం తెరకెక్కుతోంది. శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

ఇక తాజాగా ఈ చిత్రంలోని చూసాలే కళ్ళారా లిరికల్ వీడియో సాంగ్ 50 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఇక ఇదే సినిమాలో చుక్కల చున్నీకే సాంగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాని ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రమోద్ రాజులు సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement