Tuesday, April 30, 2024

చరణ్ ఓకే…చిరు అయితే మాత్రం కష్టం !!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా…. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లాహె లాహె సాంగ్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు మరో రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోందట. అయితే ఈ పాట చిరు తోనా లేక చరణ్ తోనా అనేది తెలియాల్సి ఉంది. చరణ్ తో రొమాంటిక్ సాంగ్ అంటే పర్లేదు గాని… చిరుతో రొమాంటిక్ సాంగ్ అంటే ఈ ఏజ్ లో కాస్త కష్టమే అంటున్నారు సినీ అభిమానులు. మరి ఈ ఇద్దరిలో ఎవరి తో రొమాంటిక్ సాంగ్ ను కొరటాల చేయించాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయింది. కరోనా కారణంగా మిగిలిన షూటింగ్ వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement