Sunday, May 12, 2024

ఎన్టీఆర్ కి బన్నీ బ‌ర్త్ డే విషెష్.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావ..

నేడు స్టార్ హీరో ఎన్టీఆర్ బ‌ర్త్ డే. నేటితో ఆయ‌న 40వ ఏడులోకి అడుగుపెడుతున్నాడు. పలువురు సెలబ్రిటీలు తారక్‌కు విషెస్ చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావ’ అని బన్నీ ట్వీట్ చేశారు. మంచి స్నేహితులైన తారక్, బన్నీ ఒకరినొకరు బావ అని పిలుచుకుంటారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనికి ‘దేవర’ అనే టైటిల్ ఖరారైంది. తారక్ పుట్టిన రోజు కానుకగా టైటిల్, సినిమాలో ఆయన ఫస్ట్ లుక్‌ ను చిత్ర బృందం నిన్న విడుదల చేసింది. మరోవైపు బన్నీ..పుష్ప2 షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు.కాగా ఆయన అభిమానులు దీన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement