Friday, May 3, 2024

కాజ‌ల్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. పుష్ప-2 కోసం ‘ఉ’ అంటుందా..!

టాలీవుడ్ లో అగ్ర హీరోయినీల్లో ఒక‌రు కాజ‌ల్.. ఆమెకు పెళ్లి కావ‌డం కొంత‌కాలంగా సినీమాల‌కు దూరంగా ఉంది. వ్యక్తిగత కారణాల వలన సినిమాల‌లో న‌టించేందుకు కొంత గ్యాప్ తీసుకున్న కాజల్, మళ్లీ రంగంలోకి దిగడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఆమెను సంప్రదించడం.. ఆమె అంగీకరించడం జరిగిపోయినట్టుగా తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1లో స‌మంత స్పెష‌ల్ సాంగ్ చేసి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకోగా.. ఇప్పుడు కాజ‌ల్ కు ఈ అవ‌కాశం ద‌క్క‌డంతో అభిమానులు సైతం సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందించాడు. ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. పుష్పలో ఐట‌మ్ సాంగ్ కి మంచి క్రేజ్ రావ‌డంతో.. పుష్ప 2లో కూడా ఐట‌మ్ సాంగ్ ని అంత‌కు మించిన మ్యూజిక్ ట్యూన్ దేవిశ్రీ ప్ర‌సాద్ చేశార‌ట‌. స‌మంత చేసిన ఐట‌మ్ సాగ‌ర్ జ‌నంలోకి దూసుకుపోవ‌డంతో ఈ పాట‌పై మ‌రింత ఫోక‌స్ చేయాల్సి వ‌స్తుంద‌ని దేవి అంటున్నారు. ఆ పాట కోసమే ఇప్పుడు కాజల్ ని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇంత‌కు ముందు కూడా ప‌లు సినిమాల్లో కాజ‌ల్ ఐట‌మ్ సాంగ్స్ చేసి మంచి హిట్స్ త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కూడా అదే త‌ర‌హాలో త‌న డ్యాన్స్, గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకునేందుకు కాజ‌ల్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement