Thursday, May 16, 2024

సోషల్ మీడియాకు దండం పెట్టిన అమీర్ ఖాన్..ఇదే లాస్ట్ ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సంచలన నిర్ణయంతీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన 56 వ పుట్టిన రోజు కు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అంటూ… అమీర్ ఖాన్ ఈ విషయాన్ని తెలిపాడు. ఇదే నా ఆఖరి పోస్ట్ అని చెబుతూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

ఇంతకుముందు లానే అందరితోనూ కమ్యూనికేషన్ కొనసాగుతుందని, తన ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్ తన ప్రొడక్షన్ బ్యానర్ (akppl_official) అధికారిక ఖాతాలో పంచుకుంటానని స్పష్టం చేశాడు. ఇక ఉన్నఫలంగా అమీర్ ఖాన్ తీసుకున్న నిర్ణయం పట్ల అటు నెటిజన్లు ఇటు అభిమానులు ఏం జరిగింది ఉంటుందా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement