Thursday, May 2, 2024

అలియాభట్‌కు కరోనా పాజిటివ్

బాలీవుడ్‌‌‌ను కరోనా మహమ్మారి వదలడం లేదు. వరుసగా ప్రముఖ నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరోయిన్ అలియాభట్‌‌కు గురువారం అర్ధరాత్రి కరోనా పరీక్షలు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అలియాభట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్యుల సలహా మేరకు అన్ని భద్రతా ప్రోటోకాల్స్‌ పాటిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అలియాభట్ రాజమౌళి తెరకెక్కిస్తున్న‘RRR’, సంజయ్‌ లీలా భన్సాలీ ‘గంగుభాయ్‌ కతియావాడి’ చిత్రీకరణల్లో బిజీగా ఉంటోంది. కాగా అలియాభట్ బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్‌కపూర్ కూడా కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement