Friday, April 26, 2024

రామ్ లింగుస్వామి సినిమా సెట్ లో సీనియర్ దర్శకుడి పుట్టినరోజు వేడుకలు

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవలే స్టార్ట్ అయింది. కాగా నేడు ప్రముఖ దర్శకుడు భారతీరాజా పుట్టినరోజు వేడుకలు ఈ సినిమా సెట్ లో జరిగాయి. ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్ స్పాట్ లో భారతీరాజా పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న్నాయి. మొన్నటికి మొన్న సంచలన దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమా సెట్ కు వెళ్లి వారితో ముచ్చటించిన సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement