Saturday, April 20, 2024

డిసెంబర్ లో పుష్ప?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాను ఆగష్టు 13 న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తామని నిర్మాతలు మొదట భావించారు. అయితే అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఇంకా ఈ సినిమాకు సంబంధించి 40 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తి చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement