Thursday, May 2, 2024

ప్రభాస్​ మూవీలో పెద్ద పెద్ద స్టార్లు.. ‘ప్రాజెక్ట్​ కే’ గురించి మరో బిగ్​ అప్​డేట్​ ఏంటంటే..

ఇద్దరు స్టార్​ హీరోలు కలిసి ఒక్కే స్క్రీన్ పై క‌నిపిస్తే ఆ హీరోల అభిమానుల‌కు పూన‌కాలే.. మల్టీస్టారర్​ సినిమాలు చూస్తే అభిమానులకు వచ్చే ఆ కిక్కే వేరు. అయితే ఇప్పటికే పలువురు హీరోలు బిగ్ స్క్రీన్ పై ఈ మ్యాజిక్ చేసి ఫ్యాన్స్​ ను మెప్పించారు. అయితే ఇప్పుడు మరో మల్టీస్టారర్​ రెడీ అవ్వబోతున్నట్లు ఇంట‌ర్ నెట్ లో వైర‌ల్ అవుతుంది. పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్​లలో బిజీ షెడ్యూల్ తో గ‌డిపేస్తున్నారు. అలానే.. నాగ్​ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న‌ ప్రాజెక్ట్ -కె ఒకటి.

ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్​ వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఇప్ప‌టికే చాలా పెద్ద స్టార్ క్యాస్టింగ్ నే వాడుతున్నారు నాగ్ అశ్విన్.. బాలీవుడ్​ దిగ్గజ నటుడు బిగ్​ బి అమితాబ్​ బచ్చన్​, స్టార్​ హీరోయిన్స్​​ దీపిక పదుకొణె, దిశాపటానీ ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు.

ఇప్పుడు.. ఈ మూవీలో మరింతమంది బడా స్టార్స్​ కనపడబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు, తమిళ స్టార్​ సూర్య, మలయాళ స్టార్​ దుల్కర్​ సల్మాన్​.. ఈ ముగ్గురు కూడా ఈ భారీ ప్రాజెక్ట్​లో క‌నిపించ‌నున్నార‌ని ప్రచారం జరుగుతోంది. గూగుల్​లో కూడా ప్రాజెక్ట్ -​ కె క్యాస్ట్​​ అని సెర్చ్​ చేస్తే ఈ ముగ్గురు స్టార్​ హీరోల‌ పేర్లు కూడా క‌నిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మూవీటీమ్ అధికారికంగా ప్రకటించే వరకు వేయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఇదే కనుక నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్​కు పెద్ద పండగనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement