Tuesday, April 30, 2024

క‌న్న‌ప్ప మూవీలో మ‌రో బిగ్ స్టార్.. మాలీవుడ్ సూపర్ స్టార్ ని క‌లిసిన మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుత‌న్న భారీ బ‌డ్జెట్ మూవీ కన్నప్ప. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న‌ ఈ సినిమా గురించి వస్తోన్న అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ‘కన్నప్ప మూవీ తెర‌కెక్క‌నుంది. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.. ఇక తాజాగా మరో బ‌డా స్టార్ ఈ సినిమాలోకి వచ్చారు.

మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ సైతం కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. రీసెంట్‌గా మంచు విష్ణు మోహన్ లాల్‌ను కలిశారు.. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం కన్నప్ప టీమ్ న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ .. విజయేంద్ర ప్రసాద్ .. తోటపల్లి సాయినాథ్ .. తోట ప్రసాద్ .. నాగేశ్వర రెడ్డి .. ఈశ్వర్ రెడ్డి .. ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మున్ముందు మరిన్ని అప్డేట్లతో కన్నప్ప మీద అంచనాలు పెంచబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement