Thursday, November 7, 2024

కొత్త ప్రొడక్టులతో స్మార్ట్​ మార్కెట్​ కళకళ.. లాంచ్ కి రెడీగా నయా ఫోన్లు!

ఈనెల‌లో ఐఫోన్​ 15 సిరీస్​ లాంచ్​తో స్మార్ట్​ఫోన్​ మార్కెట్​ కళకళలాడిపోయింది. యాపిల్​తో పాటు అనేక కంపెనీలు కూడా కొత్త మోడల్స్​ను లాంచ్​ చేశాయి. ఇక అక్టోబర్​లో కూడా అనేక స్మార్ట్​ఫోన్స్ లాంచ్​కు సిద్ధమవుతున్నాయి. మరి ఆ ఫోన్లు ఏవో వాటి వివరాలు చూద్దాం..

అక్టోబర్​లో లాంచ్ కానున్న స్మార్ట్​ఫోన్స్​ ఇవే..

వివో వీ29, వివో వీ29 ప్రో

అక్టోబర్​ 4, మధ్యాహ్నం 12 గంటలకు వివో వీ29, వీ29 ప్రో మోడల్స్​ లాంచ్​కానున్నాయి. 6.78 ఇంచ్​ డిస్​ప్లే స్క్రీన్​ తో పవర్​ఫుల్​ ఐఎంఎక్స్​663 సెన్సార్​ కెమెరా దీని సొంతం.

గూగుల్​ పిక్సెల్​ 8

- Advertisement -

అక్టోబర్​ 4న జరగనున్న గూగుల్​ ఈవెంట్​లో అత్యం ఎందురు చూస్తున్న‌ ఈ సిరీస్​ లాంచ్​ కానుంది. గూగుల్​ పిక్సెల్​ 8, పిక్సెల్​ 8 ప్రో మోడల్స్​ రిలీజ్ అవ్వ‌నున్నాయి.. క్రేజీ ఫీచర్స్​ వీటిల్లో ఉంటాయని తెలుస్తోంది.

వన్​ప్లస్​ ఓపెన్ఈ

వన్​ప్లస్​ ఓపెన్​ ఫోల్డెబుల్​ స్మార్ట్​ఫోన్ ఎట్టకేలకు మార్కెట్​లో లాంచ్ కి సిద్ద‌మైనట్టు తెలుస్తోంది. అక్టోబర్​ తొలి వారంలో ఈ మోడల్​ లాంచ్​ కానున్న‌ట్టు స‌మాచారం.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​23 ఎఫ్​ఈ

వాస్తవానికి ఈ మొబైల్​ సెప్టెంబర్​లోనే లాంచ్​ అవుతుందని టాక్​ వచ్చింది. కానీ ఇప్పుడు అక్టోబర్​ లాంచ్​కు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అక్టోబర్​ 19న లాంచ్​ అవ్వొచ్చు.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​44

ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ అక్టోబర్​ నెల మధ్యలో లాంచ్​ అయ్యే చాన్స్ ఉంది. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్​ దీని సొంతమని లీక్స్​ సూచిస్తున్నాయి.

ఒప్పో ఏ18

బడ్జెట్​ ఫ్రెండ్లీ ఒప్పో ఏ18 ఇప్పటికే యూఏఈలో లాంచ్​ అయ్యింది. ఇండియాలో అక్టోబర్​లో లాంచ్​కానుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

షావోమీ 13టీ సిరీస్​

షావోమీ నుంచి 13టీ, 13టీ ప్రో గ్యాడ్జెట్స్​ లాంచ్​ అవ్వాల్సి ఉంది. అక్టోబర్​లో ఈ కస్టమర్ల ముందుకు వస్తాయని తెలుస్తోంది. ఫ్లాగ్​షిఫ్​ ఫీచర్స్​ ఇందులో ఉంటాయని సమాచారం.

ప్రస్తుతం ఈ మోడల్స్​పైనే అప్డేట్స్​ ఉన్నాయి. వీటి ఫీచర్స్​, ధర వివరాలు తెలియాల్సి ఉంది. రానున్న రోజుల్లో ఈ లిస్ట్​ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement