టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు త్రిబుల్ రోల్ లో నటించిన లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ ‘‘మామ మశ్చేంద్ర’’.ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. నటుడు-రచయిత హర్షవర్ధన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలుగా నటించారు.
కాగా, తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు మేకర్స్. అప్‌డేట్ ప్రకారం, ఈ ఈవెంట్ అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో జరుగనున్నట్టు తెలుస్తోంది.
ఈ మూవీలో హర్ష వర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, సృష్టి సెల్యులాయిడ్ నిర్మిణంలో తెలుగు-హిందీ భాషల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది.
- Advertisement -