Thursday, May 2, 2024

అరియానా కొత్త ఇల్లు అదిరిపోయిందిగా..

బిగ్ బాస్ షోతో టాప్ సెల‌బ్రిటీగా మారింది అరియానా. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అరియానా తాజాగా కొత్త ఇంట్లోకి మారామ‌ని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది. బుధ‌వారం రోజు కొత్తింటికి మారాం. ఇల్లంతా సామాన్ల‌తో చింద‌ర‌వంద‌ర‌గా ఉంది. ఇది మా పరిస్థితి ఫ్రెండ్స్ అంటూ త‌న ఇన్‌స్టా స్టోరీలో వీడియోలు షేర్ చేసింది. అంతేకాదు బిగ్ బాస్ సీజ‌న్ 4లో అరియానాతో పాటు ఫేమ‌స్ అయిన చింటు ( బొమ్మ‌) ఫొటోలు కూడా షేర్ చేస్తూ, చాలా రోజుల త‌ర్వాత ద‌ర్శ‌నం దొరికింది అనే కామెంట్ పెట్టింది. అయితే నెటిజ‌న్స్ ఇది కొన్న ఇల్లా, లేక రెంట్‌కు తీసుకున్న‌దా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.బిగ్ బాస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచిన అరియానాకు హౌజ్ నుండి వ‌చ్చాక అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కింది. అంతేకాదు షోస్, సినిమా ఆఫ‌ర్స్ కూడా క్యూ క‌డుతున్నాయి. మ‌రోవైపు అవినాష్‌ని పెళ్లి చేసుకోనుంద‌నే వార్త‌ల‌తో ప్ర‌తి రోజు హెడ్ లైన్స్‌లో నిలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement