Thursday, May 16, 2024

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి….మెగాస్టార్

నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా సిని రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రముఖ గాయకుడు నవయుగ వైతాళికుడు భూపేన్ హజరికా గారికి మరణాంతరం భారతరత్న ఇచ్చినట్టు తెలుగువారు గర్వించదగ్గ నందమూరి తారక రామారావుగారికి భారత రత్న ఇవ్వాలని అన్నారు చిరంజీవి.

ఎన్టీఆర్ వందవ జన్మదినం దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అదే తెలుగుజాతికి దక్కే గౌరవం అవుతుందన్నారు. ఆ మహానుభావుడిని 98వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటున్నా అంటూ ట్విట్టర్ లో చిరంజీవి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement