Sunday, April 28, 2024

పక్కా మాస్ – బాలయ్య తో మహేష్ డైరెక్టర్ ?

పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో అనిల్ రావిపూడి కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఎఫ్2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా అనిల్ రావిపూడి నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు కార్యరూపం దాల్చబోతున్నట్లుగా తెలుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుందట. ఇక బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక అనిల్ రావిపూడి బాలయ్య తో పాటు హీరో రామ్ పోతినేని తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ తో సినిమా పై అనిల్ రావిపూడి కూడా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement