Monday, April 29, 2024

మంచు విష్ణు తండ్రితో కలిసి అప్పుడే మద్దతు మూటగడుతున్నాడుగా!!

మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు స్పీడ్ పెంచారు. మా అధ్యక్షుడు పదవి రేసులో ఉన్న విష్ణు కి మద్దతుగా ఆయన తండ్రి మోహన్ బాబు కూడా ముందడుగు వేశారు. మోహన్ బాబు విష్ణుతో కలిసి నేడు సూపర్ స్టార్ కృష్ణ ను ఆయన నివాసంలో కలిశారు. విష్ణు కు తమ మద్దతు ఇవ్వవలసిందిగా కోరినట్లు తెలుస్తుంది. అయితే వారి మధ్య జరిగిన సంభాషణ గురించి బయటకు తెలియకపోయినప్పటికీ వారు ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి మోహన్ బాబు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మంచు లక్ష్మి గతంలో కొన్ని విభాగాల బాధ్యతలను తీసుకొని ఎంతో అద్భుతంగా పని చేశారు. కాబట్టి ఈ సారి మంచు విష్ణు కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఏమవుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement