Tuesday, March 26, 2024

హరిహర వీరమల్లు@ నెగిటివ్ షేడ్ లో నిధి ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. కాగా నిధి పాత్రపై ఆసక్తికరమైన ఓ వార్త ఒకటి బయటికి వచ్చింది.

పవన్ కళ్యాణ్ ను ఆమె మోసం చేస్తూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నిధి కనిపిస్తుందట. నిధి ట్విస్ట్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే షూటింగ్ ను రీస్టార్ట్ చేయనుంది. ఈ షెడ్యూల్ లో నిధి అగర్వాల్ కూడా జాయిన్ కాబోతుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement