Sunday, May 5, 2024

మెగాఫోన్​ పట్టనున్న ఆర్యన్​ఖాన్​.. డైరెక్టర్​గా బాలీవుడ్​లోకి ఎంట్రీ..

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సినిమాలలో హీరోగా క‌నిపించ‌డు అని స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.. అయితే ఆర్య‌న్ ఖాన్ అనేక ఐడియాలపై పనిచేస్తున్నాడని తెలుస్తోంది. సినిమా లేదా వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తూ బాలీవుడ్‌లోకి అతడు ఎంట్రీ ఇవ్వనున్న‌ట్టు తెలుస్తోంది. కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఓ వెబ్‌సిరీస్‌ లేదా సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు వార్తలొస్తున్నాయి. షారూఖ్ సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ ఎంటర్‌టైన్‌మెంం‌ట్ ఈ ప్రాజెక్టును నిర్మించ‌నుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెస్ట్ షూట్ ముంబైలోని ఓ స్టూడియోలో ఈ మధ్యనే జరిగినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

‘‘ఈ ప్రాజెక్టుకు ఆర్యన్ దర్శకత్వంతో పాటు స్వయంగా కథను రాసుకున్నాడ‌ట‌. షూటింగ్ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ప్రాజెక్టు మీద అవగాహన ఉండాలని అతడు భావిస్తున్నాడు. అందుకే ఏప్రిల్ 8, 9 తేదీల్లో టెస్ట్ షూట్ చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది’’ అని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపారు. షారూఖ్ కూతురు సుహానా ఖాన్ సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్‌లోకి ఆమె రంగ ప్రవేశం చేయనుంది. ‘అర్చీస్’ కామిక్స్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement