Saturday, April 27, 2024

మెగా, నంద‌మూరి అభిమానుల‌కు మ‌రో ట్రీట్.. నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్..

ఆర్ ఆర్ ఆర్ విడుద‌ల‌కు ముందే అభిమానుల మ‌న‌స్సులో నాటుకుపోయింది నాటు నాటు సాంగ్.. చ‌ర‌ణ్‌, తారక్ సింక్ లో వేసిన స్టెప్పులు అటు మోగా ప్యాన్స్ ను ఇటు నంద‌మూరి ప్యాన్స్ ను తెగ ఆక‌ట్టుకున్నాయి. అయితే.. ప్రేక్షకులకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నాటు నాటు సాంగ్‌తో మ‌రో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మేజర్ హైలెట్స్‌లో ఒకటైన ‘నాటు నాటు’ ఫుల్ వీడియో సాంగ్‌ని కొద్ది సేప‌టి క్రితం విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేసి మెరుపులు మెరిపించారు.

సినిమా విడుదలకు ముందునుండే సంగీత ప్రియులను అలరిస్తూ వస్తున్న ఈ పాట, సినిమా విడుదల తర్వాత బిగ్ స్క్రీన్‌పై మెగా, నందమూరి అభిమానులనే కాక, యావత్ సినీ ప్రేక్షకులను రంజింపచేసింది. ఇప్పుడీ పాటని యూట్యూబ్‌లో 4కె క్వాలిటీతో విడుదల చేయడంతో.. మరోసారి ‘నాటు నాటు’ మోత మోగుతోంది. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ పాటను చంద్రబోస్ ర‌చించ‌గా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఆలపించారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement