Sunday, December 8, 2024

భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం : ఏడుగురు అరెస్ట్

డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న ముఠాల‌ను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న ఘ‌ట‌న దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.60 కోట్లు విలువైన 15.05 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. పట్టుబడిన ముఠాలు ఈ హెరాయిన్​ను అంతర్జాతీయ మార్కెట్​లో విక్రయిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement